చేర్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా నీరేష్

Niresh as sub-inspector of enrollmentనవతెలంగాణ – చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా పి.నీరేష్ శనివారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఓడాటి దామోదర్ మర్కుక్ కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో కామారెడ్డి జిల్లా పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన పి.నీరేష్ చేర్యాలకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నీరేష్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని,ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.