నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ, కన్నెపల్లి గ్రామానికి చెందిన కాక సంపత్ అనే సారలమ్మ పూజారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. వారి కుటుంబాన్ని మంత్రి సీతక్క సందర్శించి పరామర్శించారు. వారి చిత్రపటానికి పూలమాలు వేసి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడు సరళమ్మ పూజారి తల్లి, పూజారి కాక అమృత సీతక్క పై పడి బోరుణ విలపించారు. మా కుటుంబానికి దిక్కెవరు అనిరోధించారు. ఎండోమెంట్ అధికారులు ఏకపక్షంగా, పార్స్వాలిటీ వ్యవహరిస్తున్నారని, ఎవరు పూజారులు చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్నారని, ఇప్పటివరకు మా కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాలేదని మంత్రికి చెప్పుకుంటూ విలపించారు. ఒక పూజారికి ఒక న్యాయం, ఇంకో పూజారికి యింకో న్యాయమా అని రోదించారు. పూజారి వాట ధనంలో కూడా రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడం మేము ఎలా బతకాలని రోధించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సారలమ్మ పూజారి కాక సంపత్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ అధ్యక్షులు భానుచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.