మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ ధనం పచ్చ ధనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీ చైర్మన్ డి. విఠల్ రావు, మండల ప్రత్యేక అధికారి ముత్తన్న , ఎంపీడీఓ క్రాంతి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మొక్కలను నాటలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక సమస్యలు వస్తాయని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి, మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, గ్రామ కమిటీ అద్యక్షులు నరేందర్, సింగిల్ విండో డైరెక్టర్ కాశీనాథ్, ఎస్ఎంసి చైర్మన్ పద్మ గ్రామస్థులు, ఆశావర్కర్లు, అంగాన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.