జూనియర్‌ కాలేజీలకు పత్రికలను పంపిణీ చేయండి

– గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌కు టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు దినపత్రికలు, పోటీ పరీక్షల పత్రికలను ఉచితంగా పంపిణీ చేయాలని టీజీజేఎల్‌ఏ-475 డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రియాన్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి మరింత జరగాలని కోరారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు పోటీ పరీక్షలు రాయడానికి వివిధ దినపత్రికలు, పోటీ పత్రికలను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూర్ణచందర్‌, గణపతి, హరగోపాల్‌, రాజిరెడ్డి, వెంకన్న, శ్రీనివాస్‌, భాస్కర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.