హైదరాబాద్ : పిసి జ్యువెలర్స్ లిమిటెడ్ తన రుణ చెల్లింపులకు సంబంధించిన వన్ టైం సెటిల్మెంట్ (ఒటిఎస్) ప్రతిపాదనలకు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒబి) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పిసి జ్యువెలర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ బకాయిలు చెల్లించడానికి ఒటిఎస్ను ఎంచుకున్నట్లు వెల్లడించింది. ఒటిఎస్ నిబంధనలు, షరతులు సెటిల్మెంట్ కింద చెల్లించవలసిన నగదు, ఈక్విటీ భాగాలు, సెక్యూరిటీల విడుదల, తనఖా పెట్టిన ఆస్తులు మొదలైనవి ఉన్నాయని తెలిపింది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్లతోనూ బకాయిల చెల్లింపునకు ఆ సంస్థ వన్ టైం సెటిల్మెంట్ ఒప్పందాన్ని కుదర్చుకుంది.