నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూరు డోంగ్లి మండలాల పరిధిలో వివిధ గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురై ఆస్పత్రిలో పాలై చికిత్సల నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తమ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంగళవారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఎవరైనా అనారోగ్యాల పాలై ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకున్న వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కావడానికి తమ వద్ద దరఖాస్తులు చేసుకోవాలని నియోజకవర్గం ప్రజలకు కోరారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మద్నూర్ డోంగ్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పొందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.