తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన వ్యక్తి జయశంకర్..

Jayashankar is a person who lived and breathed the achievement of Telangana..– మన్మధ్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఘనంగా జయ శంకర్ వేడుకలు
నవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని మన్మధ్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రొఫెసర్ జయ శంకర్ 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాద్యాయులు, విద్యార్థులు ఆయనచిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్కగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన మహోన్నత వ్యక్తి అని తెలంగాణకు జరుగుతున్న అన్యాయన్ని ఎత్తిచూపుతూ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మహనీయుడు జయశంకర్ కొనియాడారు. అనంతరం ఉపాద్యాయులు దేవేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్కగౌడ్, ఉపాద్యాయులు , గంగాధర్ ,రాజేందర్, సుధీర్ కుమార్, గోదావరి, విద్యార్థులు పాల్గొన్నారు.