
మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కళాశాల ప్రిన్సిపల్ కే సునీల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సేవలను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారి యొక్క పాత్రను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధికరణలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క కృషి ఎంత ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి షిండే జ్ఞానేశ్వర్, కళాశాల సిబ్బంది నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.