నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రీ ఓపెన్ మార్కెట్‌ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు, నిఫ్టీ 296 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆయిల్ & గ్యాస్ రంగ షేర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ నిన్న ప్రారంభ సెషన్‌లో వెయ్యి పాయింట్లు సాధించినా ట్రేడింగ్ ముగిసే సమయానికి 166 పాయింట్లు నష్టపోయింది.