పొలం పనుల్లో రైతులు బిజీ బిజీ

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలో పరిసర ప్రాంత గ్రామాలలో గత రెండురోజుల నుండి వర్షం పడుతుండటంతో రైతులు ఎడ్ల నాగలి మరియు ట్రాక్టర్ ల సాయంతో తమ తమ చెనులలో రైతులు దుక్కి దున్నీపిస్తున్నారు.దింతో ట్రాక్టర్ల లకు కూడా తీరిక లేకుండా పోయింది. రైతులు వర్ష కాలం మొదలు కావడంతో పంటల కోసం విత్తనాలు ఎరువులను సిద్ధం చెలుకొని విత్తనాలు నాటడనికి పంటల చెనులో సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గతరెండు రోజుల నుండి వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సారి కూడా వర్షాలు సమృద్ధిగా కూర్షి పంట పొలాల తో రైతులు ఆనందంగా ఉంటారని రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా రైతుల చెనులో ఉన్న బోరు బావుల వద్ద వరి నాటు విత్తడానికి పొలంను సిద్ధం చేసుకొని వరి నాటు వేయడానికి రైతులు దుక్కి దునిపిస్తున్నారు.ఏది ఏమైనా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించే విదంగా మండలక్ అధికారులు కృషి చేయాలని రైతులు తెలిపారు.