బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేశారు. మండలంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆయనను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోసానిపేట మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు గండ్ర నర్సింలు, కాంగ్రెస్ నాయకుడు పోతుల చిన్న భాస్కర్ రెడ్డి ఉన్నారు.