సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ ఎం కృష్ణ

Cyber ​​crime should be vigilant: CIM Krishnaనవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్‌-100పై అవగాహన కలిగి ఉండాలని బాన్సువాడ టౌన్ సీఐ కృష్ణ విద్యార్థులకు, బుధవారం బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలు, డయల్ 100పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ సిబ్బంది డయల్ 100 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ మాట్లాడుతూ..  ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే డయల్‌-100కు కాల్‌ చేయాలని చెప్పారు. అపరిచితుల నుంచి ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా వచ్చే బ్లూ కలర్‌ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, మీ మొబైల్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. ఎవరైనా సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్‌ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలు, పోక్సో కేసుల పర్యవసానాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, రైతులు భూమిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సమయంలో మోసపోకుండా ఉండేందుకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవహగాహన కల్పించారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థిని సైబర్  నేరాలపై తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు. సైబర్ నేరాలపై డయల్ 100 పై తమ తల్లిదండ్రులకు వివరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.