
పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం గోవిందరావు పేట మండలం, పస్రా గ్రామ పంచాయతిలలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అన్నారు. గ్రామపంచాయతీలలో నిర్వహించే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనడంతో పాటు ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామస్థాయిలలో నియమించిన ప్రత్యేక బృందాల ద్వారా కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రకారం కార్యక్రమం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జవహర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.