సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 

CC cameras should be installed: SS Srikanth Reddy– మేడారం, తాడ్వాయి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారం, తాడ్వాయి గ్రామాలలో ప్రతీ కాలనీలలో స్థానికులు సమిష్టిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని మేడారం,  తాడ్వాయి గ్రామస్తులతో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మేడారం, తాడ్వాయి గ్రామాలలో ప్రతి వీధిలో, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అరికట్టవచ్చు అన్నారు. ఏదైనా సంఘటనలు జరిగితే నేరస్తులను తేలికగా గుర్తుపట్టవచ్చు అన్నారు. అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి యజమాని భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు, తాడ్వాయి మేడారం గ్రామాల వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యూత్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.