మండలంలోని చిక్లి గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలను బుదవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపిఓ శ్రీనివాస్ మాట్లాడుతు తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష, ప్రతి ఒక్కరు తల్లిపాలు మాత్రమే తాగించాలని వారు కోరారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచాలని అంగన్వాడి సిబ్బంది సూచించారు. శిశువు సంపూర్ణ మానసిక వికాసానికి రెండేళ్ల వయసు వచ్చేవరకు తల్లిపాలు తాగించవచ్చని వైద్య సిబ్బంది రేణుక సూచించారు. తల్లిపాలు శిశువుకు అమృతం లాంటిదని శిశువుకు తల్లిపాలు తాగించడంలో నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. గర్భిణి ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటామో తల్లి ప్రసవించిన తర్వాత కూడా పోషక ఆహారాన్ని తల్లులు తీసుకోవాలని సూచించారు. శిశువు తల్లిపాలు తాగినప్పుడు తల్లి శక్తిని కోల్పోతుందని అందుచేత సరైన ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ అనిల్, వైద్య సిబ్బంది రేణుక, సూపర్వైజర్ సుధాకర్, సీసీ కామాక్షి, సిఏ జానా బాయ్ ,అంగన్వాడి సిబ్బంది సమంత, సుభాషిని, పంచాయతీ సెక్రెటరీ నవీన్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.