
ముర్రు పాలు బిడ్డకి సంజీవని లాంటివి అని హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వావిలాలలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవలలో భాగంగా పాలిచ్చే తల్లులకు , గర్భవతులకు, తల్లి పాల ప్రాముఖ్యత పై హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి అవగహన సదస్సు నిర్వహించిన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. శిశువుకి ముర్రు పాలు అమృతమలాంటివి అన్నారు. తల్లిపాలవల్ల బిడ్డకి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతోంది అందువల్ల బిడ్డ జబ్బులకు గురికాకుండావుంటారు. రోజుకి 8 నుండి 10 సార్లు బిడ్డలకి తల్లిపాలు ఇవ్వాలి అన్నారు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి, అతర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారము ఇవ్వాలని తల్లులకి సూచించిన్నారు. తల్లిపాలలో అనేక రకలైన పోషకాలు, విటమినులు ఉంటాయన్నారు. తల్లిపాలు ఇవ్వటంవాళ్ళ తల్లులకి గర్భశాయ క్యాన్సర్ నుండి రక్షించబడతారు అని చెప్పారు. ఉభయాకాయం రాదన్నారు. తల్లికి బిడ్డకి ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుతాయి అన్నారు. గర్భషాయ రక్తశ్రావప్రమాదం నుండి రక్షింప బడుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎన్ఎం రమా, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ పాలిచ్చే తల్లులు, గర్భవతులు పాల్గొన్నారు.