రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన

Awareness of female students in residential college– సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి మోసపోకుండా ఉండాలి: ఎస్ఐ రవికాంత్ రావు.
నవతెలంగాణ – తొగుట
సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని ఎస్ఐ రవికాంత్ రావు అన్నారు. బుధవారం పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఆదేశాల మేరకు (సైబర్ జాగృకత దివాస్) కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలకు సైబర్ నేరగాళ్ళు పాల్పడే ఆర్థిక, ఆర్థికేతరా నేరాలపై తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో విద్యార్థినిలకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా సెల్ఫోన్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని అన్నారు. టెక్నాల  జీని మంచి గురించి ఉపయోగించుకొని ముందుకు సాగాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఓటీపీ, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, బయోమెట్రిక్ వల్ల మోసాల గురించి తెలిపారు. ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్ పే మెంట్స్, అడ్వర్టైజ్మెంట్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్, లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి వివరించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ విని యోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల న్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని సూచిం చారు. తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థు లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపా ధ్యాయ బృందం, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.