జనగణన ఎందుకు లేదు?

జనగణన ఎందుకు లేదు?2021లో జరగాల్సిన దశాబ్ది జనాభా లెక్కల కార్యక్రమం ఇంతవరకూ జరగలేదు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో జనాభా లెక్కల సేకరణకు అవసరమైన సమగ్ర కేటాయింపులేమీ లేవు. జిల్లా, తాలూకా, సమితి, గ్రామం వంటి పాలనా హద్దులను యథాతథంగా వుంచడం జనాభా లెక్కలకు అవసరం. కానీ 2024 జూన్‌ నాటికి వున్న పాలనా సరిహద్దులను మార్చడానికి వీలు లేకుండా స్తంభింపజేసే ఉత్తర్వులను పొడగించుతూ కేంద్రం ఎలాంటి పొడగింపూ ప్రకటించలేదు.కనుక 2020లో ప్రారంభమై వుండాల్సిన 2021 జనాభా లెక్కలు నిరవధికంగా జాప్యం అవుతున్నాయి. కోవిడ్‌ ముగిసిన తర్వాతనే జనాభా లెక్కల కార్యక్రమం నిర్వహించడం సాధ్యమని ఆ తరుణంలో ప్రభుత్వం చెప్పింది. కాని ఆ తర్వాత మూడేళ్లు గడిచినా 2024లో కూడా జనాభా లెక్కలు సేకరించే సూచనలేవీ కనిపించడం లేదు. కోవిడ్‌ తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగని నాలుగే దేశాల్లో భారత దేశం కూడా చేరుతున్నది.
బ్రిటిష్‌ కాలం నుంచి దిక్సూచిగా..
బ్రిటిష్‌ పాలనా కాలం నుంచి కూడా ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్నది. 1941లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అరకొరగానైనా జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఎందుకంటే ఈ లెక్కల వల్ల కేవలం జనాభా ఎంత వున్నారనే విషయం మాత్రమే గాక గఅహాలవారీ సమగ్ర సమాచార డేటా చేతికి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే సాగుదార్లు, వ్యవసాయ కార్మికుల వివరాలు తెలుస్తాయి. గ్రామీణ పట్టణ జనాభా ఎలా వుంది? భాష మాట్లాడే జనాభా ఎంతమంది వున్నారు? షెడ్యూలు కులాలు తెగల జనాభా ఎంత వుంది? వంటి అంశాల గురించిన ఒక చిత్రం ఆవిష్కరించబడుతుంది.
ఈ సమాచార సంపద ఆధారంగానే అన్ని స్థాయిల్లోని విధాన నిర్ణేతలు, పరిపాలకులు తమ విధానాలను రూపొందించుకోవడం వాటిని వివిధ తరగతులవారికి అనువర్తింపచేయడం జరుగుతుంది. ఉదాహరణకు జాతీయ ఆహార భద్రతా చట్టం గ్రామీణ జనాభాలో 75 శాతానికి పట్టణ జనాభాలో 50 మందికి ఈ చట్టాన్ని వర్తింప చేయాలని చెబుతున్నది. అంతేకాకుండా జనాభా లెక్కల అంచనాల ఆధారంగా ప్రకటించిన వివరాలను బట్టి కేటాయింపులు చేయాలని చెబుతున్నది. 2021 లెక్కలను తీసుకుని ఈ చట్టం కింద 81.5 కోట్ల మందికి వర్తింపజేశారు. 2024 మార్చి నాటికి సంబంధించి వేసిన ముందస్తు అంచనా ప్రకారమైతే 93 కోట్ల మందికి దీన్ని అమలు చేయాల్సి వుం టుంది. అలా జరక్కపోవడమంటే 11కోట్ల మంది అర్హులైన వారిని సబ్సిడీ లేదా ఉచిత ధాన్యాలు అందకుండా దూరం చేస్తున్నారని అర్థం.
జరగకపోతే నష్టాలెన్నో!
పార్లమెంటులో, శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ కల్పించే రాజ్యాంగ సవరణ జనాభా లెక్కల తర్వాతే ఆ పని జరగాలని నిర్దేశించింది. నియోజక వర్గాల పునర్విభజన ఆ తర్వాతే జరగుతుంది. ఇప్పుడు జనాభా లెక్కలు తీయకపో వడమంటే మహిళల రిజర్వేషన్‌ను దూరానికి నెట్టివేసినట్టే. కనీసం 2029లోనైతే ఈ పని జరగకపోవచ్చు. జనగణన లేకపోవడం వల్ల కలిగే మరో ప్రభావం ఏమంటే పట్టణీకరణ జరిగిన అనేక గ్రామాలు చట్టబద్దంగా పట్టణ హౌదా పొందలేకపోతాయి. దాంతోపాటు వాటికి వచ్చే పురపాలనా వ్యవస్థల సదుపాయాలు అందబోవు. జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల కలిగే మరో హానికర పర్యవసానం ఏమంటే పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల పునర్విభజన జరగడానికి వుండదు. ప్రజాస్వామ్యంలో నియోజకవర్గాల హద్దుల నిర్ణయం ఎలా వుండాలంటే ప్రతి వ్యక్తి ఓటుకూ సమ తూకం వుండాలి.
ఎందుకీ ఉపేక్ష?
మరి అలాంటప్పుడు ప్రభుత్వం జనాభా లెక్కల కోసం ఉత్తర్వు ఇవ్వాలనే ఉత్సుకత ఎందుకు ప్రదర్శించడం లేదు? గత కొన్నేళ్లలో శాస్త్రీయ ప్రాతిపదికన నిర్వహించిన సంఖ్యాపరమైన సర్వేల పట్ల ఒక సాధారణ తఅణీకార భావన వుండటం ఒక కారణమై వుండొచ్చు. అనేక సర్వేలను తొక్కిపెట్టడం, సర్వేల తప్పుగా మార్చడంకోసం గణాంక కొలబద్దలను మార్చడం జరిగింది.రాజకీయాలలోనూ విధానాల రూపకల్పనలోనూ అసంబద్ధతను ప్రోత్సహించేందుకు బిజెపి, ఆరెస్సెస్‌లు ప్రయోగిస్తున్న పాచిక ఇది. దీనికి ప్రేరణ హిందూత్వ భావజాలమే. ఉదాహరణకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ 2041 జనాభా లెక్కల నాటికి ముస్లిముల తాకిడితో హిందువులు అయిపు లేకుండా పోతారని పదేపదే చెబుతున్నారు. అలాంటి అహేతుక వాదనలతోనే అస్సాంలో ముస్లిం వ్యతిరేక చట్టాలు తేవడం, చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
సన్నాహాలకు శ్రీకారం?
కనుక బిజెపి హిందూత్వ శక్తుల అశాస్త్రీయ దఅక్పథానికి జనాభా లెక్కలు సమిధలవుతున్నాయి. అందువల్ల విధానాల నిర్ణయం శాస్త్రీయ సమాచారం ఆధారంగా జరగాలన్నా, సమాజంలోని పీడిత వర్గాలన్నిటికీ న్యాయం లభించేలా భరోసా కల్పించాలన్నా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన 2021 జనాభా లెక్కలు పై ఏడాదిలోనే జరగాలని గట్టిగా కోరాలి. అందుకోసం సన్నాహక కఅషి ఈ ఏడాదే ప్రారంభం కావాలి. అన్ని ప్రజాస్వామిక తరగతులు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో అదే కోరాలి.
(జులై 31 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)