గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి…

నవతెలంగాణ – మునుగోడు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర  ప్రభుత్వం పంచాయతీ కార్మికులను  పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. పెండింగ్ వేతనాలు అమలు చెల్లించి , మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు . గ్రామపంచాయతీ కార్మికులు గ్రామంలోని ప్రతి వీధి వాడ వాడలా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నప్పటికీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదని మండిపడ్డారు . గ్రామపంచాయతీ కార్మికుడు సహజ మరణానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా, విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 సవరించాలని అట్లాగే కార్మికులకు, దుస్తులు, చెప్పులు ,సబ్బులు, గ్లౌజులు తక్షణమే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు రెడ్డిమల్ల యాదగిరి, ఎర్రగోని లింగయ్య, నూకల పెద్దమ్మ, ఎర్ర అరుణ, జలంధర్, వంపు యాదయ్య, దండు శంకర్, అండాలు, సంపూర్ణ, లింగయ్య, జీడిమెట్ల లక్ష్మయ్య, సింగపంగా నగేష్, జీడిమెట్ల యాదయ్య, శోభన్ బాబు, స్వామి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.