
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బడిలీలలో వడపర్తి పాఠశాల నుండి బదిలీ అయిన ఉపాధ్యాయులను వడపర్తి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి శాలువతో బుధవారం నాడు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరినారు.ప్రాథమికోన్నత పాఠశాల వడపర్తి నుండి బదిలీ అయిన ఉపాధ్యాయులు గుర్రం రాజు ,భీంరెడ్డి శైలజ, బట్టికాడి స్వరూప, పట్ల రమేష్ లను సన్మానించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొక్క ఆంజనేయులు, ఏ ఏ పిసి చైర్మన్ పద్మ, ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి,ఉపేంద్రా దేవి,వెంకటేశ్వర్లు, సరస్వతి తలిదండ్రులు పాల్గొన్నారు.