సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

నవతెలంగాణ – ధర్మసాగర్ 
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వన మహోత్సవంలో భాగంగా  కార్యాలయంలో  మొక్కలు నాటారు.ఈ సందర్బంగా ధర్మసాగర్ మండలానికి చెందిన 107 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 30లక్షల 60 వేల 500 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపడతామని, అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ నినాదమని  అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.వ్యవసాయం దండగ కాదు,పండుగ అని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తున్నదని వెల్లడించారు తెలిపారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 2లక్షల రూపాయలలోపు రైతు రుణ మాఫి జరుగబోతుందని తెలిపారు.తెలంగాణలో 31 వేల కోట్ల రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు అని స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇన్ని వేల కోట్ల రూపాయలకు రైతుల కోసం కేటాయించలేదన్నారు.ఇది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యం అయిందన్నారు.వచ్చే నెలలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా అందజేయబోతున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను చేపడుతూ అర్హులందరికీ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సదానందం,ఎంపీడీవో అనిల్ కుమార్, ఏసిఎస్ వైస్ చైర్మన్ యాద కుమార్, మాజీ ఎంపీటీసీ రోండి రాజు యాదవ్, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్,నాయకులు బొడ్డు కుమార్,మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.