మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ 

నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం  జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. మొక్కలు  నాటిన అనంతరం వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పాటించాలి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఎస్బిసిఐ రాఘవరావు, ఆర్.ఐ లు సూరప్ప నాయుడు,నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.