కాలం రాసిన కథలు రిలీజ్‌కి రెడీ

కాలం రాసిన కథలు రిలీజ్‌కి రెడీఎం.ఎన్‌.వి సాగర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్ర ట్రైలర్‌ని పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ జగన్నాథ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈనెల 29న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ట్రైలర్‌లో ఐదు కథల మధ్య ఉన్న లవ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమా యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తుంది’ అని అన్నారు. ‘ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ డ్రామా. నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. సినిమా ఫైనల్‌ అవుట్‌ ఫుట్‌ చాలా బాగా వచ్చింది. ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని దర్శక, నిర్మాత ఎంఎన్‌వి సాగర్‌ చెప్పారు.