నవతెలంగాణ-నార్నూర్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం గ్రామాల్లో ముమ్మరంగా కొన్నసాగుతోంది. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీఓ జవహర్లాల్, ఎంపీఓ స్వప్నశీల బ్లెడ్ ట్రాక్టర్ ద్వారా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తాచెదారం తొలగించారు. గ్రామాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. సుంగాపూర్-చింతగూడ గ్రామానికి వెళ్లే కల్వర్టుపై కార్యదర్శి విజరు కుమార్, మాజీ సర్పంచ్ జీజాబాయి మొరం వేసి మరమ్మతు పనులు చేయించారు. భీంపూర్ గ్రామపంచాయితీలో రోడ్డుకు ఇరువైపులా టీఏ చౌహాన్ వికాస్ కూలీలతో కలిసి మొక్కలు నాటించారు.