నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి ఉపరితల గనిలో పనిచేసే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఉపరితల గనిలో పనులను నిలిపి వేయాల్సి ఉండాగా కాంట్రాక్టర్లు వాహనాలను నడిపించడంతో ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనాలు బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వర్షాల కారణంగా ఉపరితల గని ఓబీ కాంట్రాక్టు కంపెనీకి సంబందించిన రెండు వోల్వో వాహనాలు బోల్తా పడ్డాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.