రుణమాఫీ సంతోషం బ్యాంకు వరకే

The happiness of loan waiver is up to the bank– ఆందోళన కలిగిస్తున్న నో డ్యూ సర్టిఫికెట్‌
నవతెలంగాణ-నేరడిగొండ
తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎంతో సంతోష పడ్డారు. కానీ వారి సంతోషం బ్యాంకుల వరకే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది. డబ్బుల విషయంలో రైతులు బ్యాంకు వెళ్తే గ్రామీణ బ్యాంక్‌ అధికారులు సెర్ఫ్‌(వెలుగు) కార్యాలయం నుండి నో డ్యూ సర్టిఫికెట్‌ తీసుకురావాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు. సెర్ఫ్‌ అధికారులు పాత బాకి ఉందని నో డ్యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో రుణమాఫీ డబ్బులను పాత బకి కింద జమ చేసుకుంటున్నరని రైతులు ఆరోపిస్తున్నారు. స్వయంగా కలెక్టర్‌ అధికారులకు ఎలాంటి కోత లేకుండా రుణమాఫీ ఇవ్వాలని ఆదేశాలిచ్చిన ఫలితం లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. ఈ విషయంపై సెర్ప్‌ ఏపీఎం ఉత్తమ్‌ని వివరణ కోరగా 8, 9 సంవత్సరాలుగా బ్యాంక్‌ నుండి వెలుగు ద్వారా తీసుకున్న బాకీ తిరిగి కట్టక పోవడంతో ప్రభుత్వం చేస్తున్న ఈ రుణమాఫీలో నుండి కాట్‌ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తు ఖాతాలలో డబ్బు జమ చేస్తుంది కానీ బ్యాంకులలో పాత బాకీ ఉందని రుణమాఫీ డబ్బులు కట్‌ చేసుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.