న్యూఢిల్లీ: ఫార్మా రంగంలోని స్మాల్‌క్యాప్ కంపెనీ సిగాచీ ఇండిస్టీస్ 2024 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 13 శాతం వృద్థితో రూ.95.71 కోట్ల అమ్మకాలు చేసినట్లు ప్రకటించింది. 2023 ఇదే త్రైమాసికంలో రూ.84.70 కోట్ల విక్రయాలు చేసింది. ఇదే సమయంలో రూ.10.88 కోట్లుగా ఉన్న నికర లాభాలు.. గడిచిన క్యూ1లో 20.96 శాతం పెరిగి రూ.13.16 కోట్లుగా నమోదు చేసింది. ఆగస్టు 6న జరిగిన బోర్డు సమావేశంలో బిందూ విండొధన్‌ను తిరిగి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.