ఘనంగా నాగపంచమి పండుగ

Nagapanchami is a grand festival– నాగదేవతలకు, ఇండ్ల దర్వాజాలకు ప్రత్యేక పూజలు

– అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెలు కండ్లు కడిగారు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో శుక్రవారం నాడు నాగపంచమి పండుగ మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆవుపాలతో పాటు పత్రి కుంకుమ పసుపు జొన్న ప్యాలాలు నాగదేవతకు ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఇండ్లకు వచ్చిన ఆడబిడ్డలు ముందుగా ఇంటి దర్వాజలకు కుంకుమ పశువులతో పత్రి జొన్న ప్యాలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు పుట్టకు పూజించిన ఆవుపాలతో కండ్లు కడిగారు. ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లు కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మండల కేంద్ర మహిళలంతా ఎల్లమ్మ చెరువు కట్ట నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగకు ప్రత్యేకమైన వంట తాలుకల పాశం అక్క చెల్లెళ్లతో కండ్లు కడుక్కున్న తర్వాత కుటుంబీకులంతా తాలుకల పాశంతో భోజనాలు చేశారు.