చలో మాదిగ చలో 11న బిచ్కుంద కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం నాడు మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చలో మాదిగ చలో 11న బిచ్కుంద కార్యక్రమం పై అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలోతేదీ:11.08.2024 ఆదివారం 11.00 గంటలకు బిచ్కుంద మండలం కేంద్రంలో ఎస్సీ వర్గీరణ విజయోత్సవ బహిరంగ సభ. స్థలం మార్కెట్ యాడ్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, మన మాదిగ జాతి ముద్దు బిడ్డలు ప్రతి కుటుంబం నుండి చిన్న పెద్ద తేడా లేకుండా మాదిగ జాతి సంఘాలు నాయకులు మాదిగ జాతి ఉప కులాల వారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఎమ్మార్పీఎస్ నాయకులు షేకాపూర్ తుకారం పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు విలాస్ గైక్వాడ్ పలువురు నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.