భూ కజ్జాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి

– ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – ఆర్మూర్  
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ,కోట ర్మూర్ పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ధ్యా గ ఉదయ్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ జి వి నరసింహ రెడ్డి లు అన్నారు. బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కు వినతి పత్రం ఇచ్చినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోరినట్లుగా ఒక కమిటీ వేసి, విచారణ జరిపించి న్యాయం చేస్తానని ఆర్డిఓ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమం లో , కిసాన్ మోర్చా  నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగొట గంగాధర్, జెస్సు అనిల్, నాయకులు ఆకుల శ్రీనివాస్, సుంకరి రంగన్న,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, ప్రధాన కార్యదర్శి యుగేందర్, నాయకులు అరె రాజేశ్వర్, కిరణ్, కుమార్, చిట్టీ భజన్నా,బీజేవైఎం పట్టణధ్యక్షులు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షులు భాశెట్టి రాజకుమార్, తోట నారాయణ, అశోక్  తదితరులు పాల్గొన్నారు.