ఎమ్మెల్యే రామారావు పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో మొక్కులో భాగంగా ఆయన సోదరుడు పవార్ దత్తాత్రేయ పటేల్ బైంసా లోని ఎమ్మెల్యే నివాసం నుండి బాసర అమ్మ వారి క్షేత్రం వరకు శుక్రవారం సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం బిజెపి కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ని దర్శించుకోవడానికి సైకిల్ యాత్ర ద్వారా రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు సతీష్ రెడ్డి, కోరిపోతన్న, గంటా శ్రీనివాస్, అనిల్, లక్ష్మారెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.