– జిల్లా అధ్యక్షులు కుర్ర శంకర్ నాయక్
నవతెలంగాణ – హాలియా
గిరిజన హక్కులను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కోర్ర శంకర్ నాయక్ అన్నారు.శుక్రవారం హాలియా పట్టణంలో త్రివేణి ఒకేషనల్ కాలేజీలో ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 9 న జరుగుతున్న ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాలలో రాజకీయాలకు అతీతంగా గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర, ప్రభుత్వ గిరిజన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని సైతం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజన తెగల హక్కులను రక్షించడం, స్వయంపాలన, జీవన విధానం, సంస్కృతి,ఆచార వ్యవహారాలను గౌరవించడం, గిరిజనుల అభివృద్ధి, భాషల గుర్తింపు,విద్య,ఆరోగ్యం వంటి లక్ష్యాలను సాధించే దిశగా పాలక ప్రభుత్వాలు కృషిచేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిందన్నారు.ఆగస్టు 9 ప్రపంచ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివాసి గిరిజన తెగలు తమ హక్కుల సాధన కోసం నినదించాలని పిలుపునిచ్చారు ప్రపంచ గిరిజన ప్రజలందరికీ గిరిజన హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న గిరిజన తెగల జీవన విధానం,సంస్కృతి,ఆచారాలు,ఆహారఅలవాట్లపై కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని గిరిజనుల హక్కులు,చట్టాలను కాలరాస్తూ 2023లో నూతన అటవీ సంరక్షణ నియమాల చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. దీనివలన కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు బలవంతంగా అడవుల నుండి గెంటివేయబడతారని అన్నారు. కేంద్ర, ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మేరావత్ ముని నాయక్ డేపావతి శివాజీ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ నరేష్ నాయక్ ఎల్ ఎస్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ హరి నాయక్ హాలియా పట్టణ అధ్యక్షులు నేనావత్ అశోక్ నాయక్ తిరుమలగిరి మండల అధ్యక్షులు కోర్ర రాజు నాయక్ లాలూ సుందర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.