నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థి విద్యార్థులకు , మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వేర్నెస్, తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పచ్చదనంతో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, పరిసరాల పరిశుభ్రత ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ బిక్షం, డాక్టర్ బ్లెస్సీ, మున్సిపల్ మేనేజర్ ఆర్. అరుణ కుమారి, మెప్మా సిబ్బంది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, వార్డు అధికారులు, ఉపాధ్యాయులు, అంగనివాడీలు, చిన్నారులు, సిబ్బంది పాల్గొన్నారు.