నిఖార్సైన కమ్యూనిస్టు బిక్కి పుల్లయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

young-people-should-take-the-life-of-retired-communist-bikki-pullaiah-as-an-example– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – నూతనకల్ 
నిఖార్సైన కమ్యూనిస్టుగా జీవించిన బిక్కీ పుల్లయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం  మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బిక్కి పుల్లయ్య అంతిమ యాత్రలో, గ్రామం నడిబొడ్డున జరిగిన సంతాప సభలో పాల్గొని  మాట్లాడుతూ అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయమైన ఈ గ్రామంలో సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసంపని చేశారని అన్నారు. చదువు, అక్షరజ్ఞానం లేకున్నాపార్టీ నిర్ణయాలను, విధానాలనుతూచా తప్పకుండాఅమలు చేశారని అన్నారు. ఎన్ని నిర్బంధాలు,  ఆటంకాలు వచ్చిన నికార్సైన  కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు. గ్రామంలో శత్రువుల దాడులను ఎదుర్కొని ఎర్ర జెండాను నిలబెట్టడంలో  ప్రముఖ పాత్ర పోషించారనిగుర్తు చేశారు. పార్టీలో చీలికలు వచ్చినప్పుడు సైతం సీపీఐ(ఎం) వైపు నిలిచి పార్టీని కంటికి రెప్పలా కాపాడిన త్యాగశీలి అని అన్నారు. వృద్ధాప్యంలోనూచురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూవారి కుటుంబాన్ని కుమారులను, బిడ్డలను, అల్లులను ఉద్యమానికి అంకితం చేశారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీగా పనిచేస్తూగ్రామంలో వచ్చినప్రజా సమస్యలనునిక్కచ్చిగా మాట్లాడివాటిని సామరస్యంగాపరిష్కరించడంలో తనదైన శైలిలో అతను చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
ప్రతి భూ సమస్య కుటుంబ సమస్య అనేక సమస్యలు పార్టీలు కులాలు లకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారికి తమ నివాస గృహం ముందు ఒక్క న్యాయస్థానం లాగా ఒక జర్జి లాగా తీర్మానం చెప్పి ఇద్దరిని మెప్పించి ఒప్పించి సమస్యలను సమర్యంగా పరిష్కరించడంలో  జర్జి ని తలపించ చేసే వారిని అన్నారు గ్రామంలో ఎన్నో ప్రలోభాలకు గురై పార్టీలు మారుతున్న ఈ రోజుల్లోతాను నమ్మిన సిద్ధాంతానికినిలబడి కడదాకా కమ్యూనిస్టు యోధుడుగా నిలబడి ఆ గ్రామ ప్రజల మనసులను చురగున్న మంచి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు  అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎర్ర జెండా వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలోపెద్ద ఎత్తున కవులు కళాకారులు, డప్పు చప్పులతో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో కళాకారులు పాడిన విప్లవ గేయాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలుమల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి రమణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునెమ్మది వెంకటేశ్వర్లు,కొలిశెట్టియాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుపులుసు సత్యం,బుర్ర శ్రీనివాస్,మండల కమిటీ సభ్యులు బొజ్జ శ్రీనివాస్,తొట్ల లింగయ్య,గజ్జలశ్రీనివాస్ రెడ్డి,అల్లిపురం సంజీవరెడ్డి, బత్తుల సుధాకర్ బి క్కీ పుల్లయ్య కుమారులుగురువయ్య, ఓంకార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుతో పాటువందలాదిమంది కార్యకర్తలుపాల్గొన్నారు.