
మండలంలోని పలు గ్రామాలలో నాగ పంచమి వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి కల్లాపు చల్లి, శుభ్రం చేసుకోవడంతో పాటు ఆవుపాలు, నైవేద్యం సమర్పించి పుట్టలో పాలు పోయడం జరిగింది. ఈ పండుగ ఆడబిడ్డలకు ఒక ప్రత్యేక వేడుక లాంటిది. అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు పుట్టలో పాలు పోసిన అనంతరం తమ సోదరులకు ఆవు పాలతో కళ్ళు కడిగి తమ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని జీవించాలని ఆశీర్వదించగా వారికి తమ సోదరులు బహుమానం ఇవ్వడం ఆనవాయితీగా మారింది.