
శంకరపట్నం మండల కేంద్రంలో బస్ స్టాప్ సమీపంలో శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ హిసమోద్దీన్ ఆధ్వర్యంలో 64వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాగోని బసవయ్య గౌడ్, పాల్గొని పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీకి యువత చాలా ముఖ్యపాత్ర పోషించాలని యువతకు సందేశించారు. రానున్న ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశలు ఉంటాయాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షారుఖ్,జనగాం మణిదీప్,ఆడెపు అజయ్, బొంగోని శ్రావణ్, ఆయన్ ఆదిల్,సాయి,సోను,గండికోట రవి,రామ్ తదితరులు పాల్గొన్నారు.