హార్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేయండి 

Make Har Ghar Tiranga Yatra a success– బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్య గౌడ్ 
నవతెలంగాణ – చండూరు  
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన హార్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి  పిలుపునిచ్చారు. శుక్రవారం  పట్టణ కేంద్రంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అధ్యక్షతన జరిగిన  ముఖ్య కార్యకర్తల సమస్యలు పాల్గొని మాట్లాడారు.  హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఈనెల 10-11 తేదీలలో విగ్రహాల పరిశుభ్రత, 11- 13 తేదీలలో తిరంగ యాత్ర ర్యాలీ, 13-15 తేదీలలో తిరంగా ఉత్సవం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా ఉపాధ్యక్షులు సోమ నరసింహ, సింగిల్ విండో  డైరెక్టర్ బోడ ఆంజనేయులు, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న , భూతరాజు శ్రీహరి  , కటకం నరేష్ , దోటీ శివకుమార్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.