నవతెలంగాణ – నిజాంసాగర్
విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 కేవీ నెలవారి నిర్వహణ కారణంగా మండలంలోని మల్లూర్,అచ్చంపేట్, నర్సింగ్ రావు పల్లి, నిజంసాగర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగాదారులు సహకరించగలరని ఆయన అన్నారు.