డీసీఎంఎస్ చైర్మన్ ను సన్మానించి బంజారా నాయకులు 

Banjara leaders honored the DCMS chairmanనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయకున్  మండల బంజారా నాయకులు సన్మానించినట్టు మండల  మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్ తెలిపారు. తారా చంద్ర నాయకులు శాలువాతో పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బంజారాలకు జిల్లాస్థాయి పదవి కట్టబెట్టడంతో జిల్లా ప్రజలందరూ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు అప్పల రాజన్న మునిపెల్లి అనంతరెడ్డి మండల బంజారా నాయకులు తదితరులు ఉన్నారు.