
రెంజల్ మండలం గండిగుట్ట గ్రామాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, అంగన్వాడి కార్యకర్తకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టినట్లయితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అలాగే తల్లులు ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని ఆమె సూచించారు. అంగన్వాడి చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికారాన్ని అందజేస్తుందని, చిన్నారుల ఎత్తు, బరువులను కొలసి వారికి పోషకమైన ఆరాన్ని అందజేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అనంతరం నూతనంగా విచ్చేసిన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజమణి, పిల్లల తల్లులు, గర్భిణీ బాలింత మహిళలు పాల్గొన్నారు.