నవతెలంగాణ- మల్హర్ రావు.
స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం మండలంలో పెద్దతూoడ్ల తోపాటు ఆయా గ్రామాల్లో మండల ఎంపిడిఓ శ్యామ్ సుందర్, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో విస్తృతంగా చేపట్టారు.గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు, డ్రైనేజీల్లో చెత్త,చెదారం తొలగించి సీజనల్ వ్యాధులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ పారిశుధ్య సిబ్బందితో చల్లించారు. ఈగలు,దోమలు వ్యాప్తి చెందకుండా పిచికారీ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు సతీష్,సునీత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.