– ఆసిఫాబాద్ ఎస్పీ డివి శ్రీనివాసరావు
– ఆరు ఉద్యోగాలు సాధించిన నిఖితకు సన్మానం
నవతెలంగాణ-ఆసిఫాబాద్
లక్ష్యం కోసం నిరంతరం కృషి పట్టుదలతో కష్టపడితే విజయం సాధ్యమవుతుందని ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సర్దార్ సింగ్ కూతురు నిఖిత ఒకేసారి గురుకుల టీజీటీ, పీజీటీి, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ కాలేజ్ లెక్చరర్, గ్రూప్-4 పరీక్షలలో ఉద్యోగం సంపాదించగా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో 6 ఉద్యోగాలు సాధించడం అనే విషయం చిన్నది కాద్నారు. కృషి పట్టుదలతో లక్ష్యం వైపు సాగాలనడానికి అమ్మాయి నిదర్శనమని తెలిపారు. నిరంతరం కష్టపడుతూ పైకి ఎదిగే వారికి తాము ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. నిఖిత యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్‌ఐ అడ్మిన్ పెద్దయ్య, సర్దార్ సింగ్, ఆయన భార్య సంధ్య, కుమారుడు పాల్గొన్నారు.