పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం

నవతెలంగాణ-రాజంపేట్
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో గురువారం ఎంపీడీవో బాలకిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో గ్రామపంచాయతీ కి సంబంధించిన అంశములు మరియు ఉపాధి హామీ కార్యక్రమాల అంశములు, లేబర్ టర్నోవర్, తదితర అంశములపై సమావేశం నిర్వహించమన్నారు. అనంతరం గ్రామంలో గల పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో  ఎంపీ ఓ రఘురాం  ఏపీవో భాస్కర్, ఈసీ  రాధిక, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు టిఏలు తదితరులు పాల్గొన్నారు.