దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి 

Dammu tractor overturned and driver diedనవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామం విషాదంలో మునిగింది. ఈ ఘటన జిల్లాలోని తాడ్వాయి మండలం లోని ఊరటం గ్రామపంచాయతీ పరిధిలోగల కన్నెపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గొంది కృష్ణారావు గత కొన్ని సంవత్సరాలుగా కడారి మోహన్ రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా జంపన్న వాగు సమీపంలో బీరెల్లి రామ్ రెడ్డి పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ కేజీ వీల్స్ తిరగబడి గొంది కృష్ణారావు అనే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తాడ్వాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య సరోజన, నవ్య శ్రీ శ్రావణి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.