కాంగ్రెస్‌ పాలనలోనే అవినీతి, అక్రమాలు

– మంత్రి, శాసన మండలి చైర్మెన్‌పై విమర్శలు చేస్తే ఉపేక్షించం
– డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి హెచ్చరిక మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో అవినీతి, ఆక్రమాలు, స్కాంలు జరిగాయని, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్‌ ఆయిన కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచకోని నీతులు మాట్లాడితే సరికాదు…హుందాగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది.. కాని అనునిత్యం జిల్లా అభివద్ది కోసం ఆరాటపడే మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ఉపేక్షించబోమని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను హెచ్చరించారు. భట్టి విక్రమార్క నల్లగొండలో చేపట్టిన పాద యాత్ర సందర్భంగా మంత్రి, గుత్తాలపై చేసిన విమర్శలపై గురువారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ అభివద్ధి కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ 9 ఏండ్ల కాలంలో సీఎంను ఒప్పించి వేల కోట్ల నిదులు తెచ్చి ఎంత అభివద్ధి చేసిందో చూస్తూనే కండ్లున్న కబోదిలా మాట్లాడుతావేంది బట్టీ అని ‘ ప్రశ్నించారు. మీ ఏలుబడిలో నల్లగొండలో నలుగురు మంత్రిగిరి చేసిన అభివద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాడు ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యం పండగా… నేడు 30 లక్షల టన్నుల దాన్యం పండుతున్న విషయం మీ నేతలు చెప్పడం లేదా రాష్ట్రంలో నల్లగొండే నంబర్‌ వన్‌ స్థానం అని నీకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్‌ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివద్ధి చెంది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. నువ్వు చేసే పాద యాత్రలో జిల్లాకు వచ్చే సాగు నీరు, ప్రజలు తాగే తాగు నీరు, 24 గంటలు అందించే విద్యుత్‌, జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, ఫ్లోరైడ్‌ బారి నుండి బయట పడ్డ మునుగోడు ప్రజల సంతోషం, కాలేశ్వరం జలాలు, బస్వాపురం, యాదాద్రి టెంపుల్‌, పవర్‌ ప్లాంటు నిర్మాణాలు వినటం లేదా జనం చెప్పటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో అభివద్ధి చేశామని మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటాయని అన్న ఆయన మొదట మీ పార్టీలో ఉన్న నేతలంతా కొట్లాడటం మానేసి కలిసి ఉండటం నేర్చుకోండి అన్నారు. ఇకపై బీఆర్‌ఎస్‌ పార్టీపైనా లేదంటే మంత్రి, గుత్తాలపైనా విమర్శలు చేస్తే ప్రజలు పాదయాత్ర కూడ చేయనివ్వరు అని హెచ్చరించారు.