నవతెలంగాణ – మల్లాపూర్
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలలో చదివే విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని బిఆర్ఎస్ నాయకులు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల పాము కాటుకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వివి రావు పేట గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాలు ఒక వెలుగు వెలిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యా వైద్య విధానాన్ని తుంగలో తొక్కయని అన్నారు. ఎన్నో ఆశలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం గురుకులాలలో విద్యార్థులను చేర్పిస్తే వారు పాముకాటుకు, ఫుట్ పాయిజన్ అయి విగత జీవులుగా ఇంటికి వస్తున్నారని వాపోయారు. గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థుల చావులకు కారణం ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పాముకాటుకు గురైన చికిత్స పొందుతున్న విద్యార్థులకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ వెంటనే ప్రకటించి, బాధిత కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాలలో బాదితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గురుకులాలలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కనీస సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మాజీ, సర్పంచ్ వేల్పుల గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ బిట్ల నరేష్,జిల్లా బిఆర్ఎస్ నాయకులు మినుగు చంద్రశేఖర్, నాయకులు భాస్కర్, గంగాధర్, సాయన్న రాజేష్, రమేష్, నరేష్, చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.