
మన ఊరు మనబడి మొదటి విడత పనులలో భాగంగా నూతనంగా నిర్మించిన వంటశాలకు బిల్లులు ఇవ్వడం లేదని ఎస్ఎంసి చైర్మన్ వంటశాలలోకి గొర్రెలను తోలిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగుంట గ్రామానికి చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దండికే శంకరయ్య మన ఊరు మనబడి మొదటి విడతలు పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణం చేపట్టాడు. ఆ పనులను ప్రారంభమై యాడాది గడుస్తున్న బిల్లుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇటీవల కిచెన్ షెడ్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఖాతాలో ఉన్న రెండు లక్షల రూ.35 వేల రూపాయలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగిన వాటిని ఇవ్వడం లేదని వాపోయాడు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ డబ్బులను విడుదల చేయడం లేదని వాపోయాడు. దీంతో విరక్తి చెందిన శంకరయ్య సోమవారం ఉదయం బడి పిల్లలు స్కూల్కు వచ్చే సమయానికి మేకల గొర్రెల మందను నూతనంగా నిర్మించిన కిషన్ షెడ్డులోకి తోలాడు. దీంతో అక్కడున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై ఎంఈఓ వాసం భీమయ్యని వివరణ కోరగా.. షెడ్డు కు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమైనవన్నీ, వాటిని ఎలా డ్రా చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి విధివిధానాలు రాలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని తిరిగి అందజేస్తామని తెలిపారు.