అనారోగ్య బాధితులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu stands by the sick victims– రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న  నిరుపేద బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలువురికి అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసిలు ఇప్పిస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం హర్షన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకపోయారు.వెంటనే దుద్దిళ్ల స్పందించి వైద్య ఖర్చుల కోసం సిఎంఏప్ఆర్ ద్వారా రూ.2.50 లక్షల  ఎల్ఓసిని మంజూరు చేయించి మంత్రి ఆసుపత్రి సహాయకుడి ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఇందుకు బాధితురాలు కుటుంబం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.