మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 21 రూట్లో బస్సులు నడపండి

Run buses on 21 routes across Munugodu Constituencyనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పబ్లిక్  రవాణా కనెక్టివిటీ,ఆర్టీసీ బస్టాండ్ ల నిర్మాణం,నవీకరణ,ఆయా రూట్లలో నడపాల్సిన బస్సుల సంఖ్య,ఆర్టీసీ సంబంధిత విషయాలపై అన్ని మండలాల ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.నియోజకవర్గ వ్యాప్తంగా  ఎన్ని ఆర్టీసీ బస్సులు కావాలి,ఏ ఏ రూట్లో ఎక్కువగా నడపాలి,ఆ రూట్లలో ఏ ఏ సమయాలలో నడపాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో ఆర్టీసీ బస్సు స్టాండ్ ల నిర్మాణం,నవీకరణ విషయాలపై కూలంకుషంగా  మండల నాయకులతో చర్చించిన తర్వాత వినతి పత్రంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కు తన నాయకులతో  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమస్యలను వివరించారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి నియోజకవర్గానికి కావలసిన  ఆర్టీసీ బస్ స్టాండ్లు,బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పన,వివిధ రూట్ లలో నడపాల్సిన బస్సులకు సంబంధించి వినతి పత్రం అందజేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మండల అధ్యక్షులు బోయ దేవేందర్ పట్టణ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ నాంపల్లి మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్ రెడ్డి
మునుగోడు, చండూరు, మర్రిగూడ, చౌటుప్పల్ బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కల్పన తో పాటు నవీకరణ పనులను మంత్రి గారికి వివరించారు. నాంపల్లి, నారాయణపూర్ మండల కేంద్రాలలో కొత్త బస్టాండ్ ల నిర్మాణం కు ప్రతిపాదనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా  21 రూట్లలో  బస్సు సర్వీస్ ల పునరుద్ధరణ చేయాలని కోరారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 21 ఆర్టీసీ  రూట్ ల వివరాలు… 
1.నల్గొండ – మాల్ వయా మునుగోడు చెల్లేడు గట్టుపల్ శివన్నగూడ మర్రిగూడ…
2.దేవరకొండ – యాదగిరిగుట్ట  వయా  మల్లపు రాజు పల్లి నాంపల్లి మర్రిగూడెం గట్టుప్పల్ జనగాం నారాయణపూర్ చౌటుప్పల్ వలిగొండ  భువనగిరి
3.ఇబ్రహీంపట్నం- గుర్రంపోడు వయా లోయపల్లి శివన్న గూడెం మర్రిగూడెం దామెర నాంపల్లి
4.నార్కెట్పల్లి – దేవరకొండ వయా బ్రాహ్మణ వెల్లంల, మునుగోడు చండూరు పెద్దాపురం నాంపల్లి పసునూరు మల్లేపల్లి
5.నల్గొండ – ఇబ్రహీంపట్నం వయా  మునుగోడు కొంపల్లి వెలమకన్నె గట్టుప్పల్ శివన్న గూడెం లోయపల్లి
6.దేవరకొండ – హైదరాబాద్ వయా పాల్వాయి రేవల్లి గట్ల మల్లేపల్లి, నాంపల్లి మర్రిగూడెం మాల్
7.ఇబ్రహీంపట్నం –  నారాయణపూర్  వయ కడీల బాయి తండా, తూంబాయి తండ, వెంకం బావి తండా
8.నార్కట్పల్లి – శ్రీశైలం ( ఎక్స్ప్రెస్) వయా  నార్కెట్పల్లి చిట్యాల మునుగోడు చండూరు నాంపల్లి డిండి
9.నల్గొండ – దేవరకొండ వయా  మునుగోడు చండూరు గుండ్రపల్లి చామలపల్లి వెంకటంపేట్ మల్లేపల్లి
10.నల్గొండ – చౌటుప్పల్ వయా  మునుగోడు పలివెల కిష్టాపూర్  వెలిమినేడు
11.పలివెల – హైదరాబాద్ పలివెలలో నైట్ హాల్ట్ చేసి ఉదయం 5 గంటలకు
12.ఇబ్రహీంపట్నం – కమ్మ గూడెం( మర్రిగూడెం ) వయా   ఇబ్రహీంపట్నం మాల్ మర్రిగూడెం వట్టిపల్లి దామర భీమనపల్లి కమ్మగూడెం నేరెళ్లపల్లి చండూరు
13.దేవరకొండ – యాదగిరిగుట్ట వయా నాంపల్లి చండూరు మునుగోడు చిట్యాల భువనగిరి
14.నల్గొండ – మాల్ వయా నల్గొండ కనగల్ చండూరు నాంపల్లి మర్రిగూడ మాల్
15.నల్గొండ – చిట్యాల  వయా  మునుగోడు సింగారం ఊరుకోండి తాళ్ల వెళ్ళాంల
16.నల్గొండ – మునుగోడు వయా  దోమలపల్లి కాల్వపల్లి పులిపల్పుల జనస్తాన్పల్లి
17.దిల్షుక్ నగర్ – నారాయణపూర్ ( నైట్ హాల్ట్ ) వయా  చేరిగూడెం చిమ్మిరియాల గుడిమల్కాపురం నాలుగు ట్రిప్పులు
18.దిల్షుక్ నగర్ – గట్టుప్పల్ ( నైట్ హాల్ట్ ) రెండు ట్రిప్పులు
19.నల్గొండ -చౌటుప్పల్( గుజ్జ నైట్ హాల్ట్ ) వయా  మునుగోడు పలివెల గుజ్జ కోతులారం చౌటుప్పల్
20.నల్గొండ – హైదరాబాద్ వయా చండూరు శివన్న గూడెం మర్రిగూడెం మాల్  మూడు ట్రిప్పులు
21. దిల్ సుక్ నగర్- చండూరు వయా  శివన్న గూడెం,లోయపల్లి,కేవీ పల్లి,లెంకలగూడెం రూట్లలలో బస్సులను నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.