
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామ శివారు తో పాటు, జూపల్లి గ్రామశివార్లో గత రెండు మూడు రోజులుగా ఐదు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసినట్లు స్థానిక రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొండి వాగు సమీపంలో రెండు, దూపల్లి గ్రామ శివారులో మూడు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ ను దొంగలించారని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో వ్యవసాయ బోర్ల ద్వారా తమ పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు తాపత్రయ పడుతున్న ఈ తరుణంలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేయడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి సమయాలలో పోలీసు యంత్రాంగం ప్రత్యేక పెట్రోలింగ్ చేసి ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానిక రైతుల పేర్కొంటున్నారు. ట్రాన్స్ఫర్ ధ్వంసం చేస్తున్న దుండగులను గుర్తించడానికి రైతులు, విద్యుత్ శాఖ సి బ్బంది ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు యంత్రాంగం రాత్రి సమయంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.